-మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు
అవినీతి పరులందరూ మీ పక్కనే ఉన్నారమ్మ…
మీడియా సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు
తమ నాయకుడు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని…మైనార్టీ సెల్ నాయకులు అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైసిపి మండల కన్వీనర్ అత్తిపల్లి అనుప రెడ్డి ఆధ్వర్యంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ సెల్ నాయకులు మాట్లాడుతూ…. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మా ప్రసన్నకుమార్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేసినందువల్లే ఆయన విమర్శలు చేయడం జరిగిందన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి పరుడు అని అంటున్నారని… అవినీతిపరులు అందరు మీ పక్కనే ఉన్నారమ్మా అది మీకు తెలియట్లేదా అని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిలో కానీ అవినీతిలో కానీ ఎక్కడైనా చర్చకు సిద్ధమని టిడిపి నేతలకు సవాల్ విసిరారు. ప్రసన్న ఇంటి పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆపరేట్ సభ్యులు జుబేర్ భాష, ఎస్ కే సాహుల్, కరిముల్లా,నియోజకవర్గ మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…..