నిర్దేశించిన సమయంలో కు పరిష్కారాలు అందించండి_ _డిప్యూటీ కమిషనర్ చెన్నుడు_
కార్పొరేషన్ గ్రీవెన్స్ కి 57 వినతులు
-నిర్దేశించిన సమయంలో కు పరిష్కారాలు అందించండి
- డిప్యూటీ కమిషనర్ చెన్నుడు
నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను డిప్యూటీ కమిషనర్ చెన్నుడు నిర్వహించారు. ఆయన అధికారులతో కలసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని డిప్యూటీ కమిషనర్ చెన్నుడు అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కార వేదికలో మొత్తం 57 అర్జీలను అందుకున్నామని చెన్నుడు తెలిపారు. అర్జీలన్నింటిని త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన బాధితులకి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ విభాగం ఎస్ఇ రామ్ మోహన్ రావు, ఈ.ఈ రహంతు జానీ, టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి రఘునాథ్, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.