ఊపిరితిత్తిలో గడ్డతో మంచానికే పరిమితమైన బాలిక
ఒక్క నెలకు లక్షల రూపాయల్లో మందులు అవసరం
ఆదుకునే ఆపన్న హస్తం కోసం పేద దంపతులు ఎదురుచూపులు
సంధ్యా తల్లిదండ్రుల ఫోన్ నెం. 9502779514_
మా బిడ్డను బతికించండి…
- ఊపిరితిత్తిలో గడ్డతో మంచానికే పరిమితమైన బాలిక
- ఒక్క నెలకు లక్షల రూపాయల్లో మందులు అవసరం
- ఆదుకునే ఆపన్న హస్తం కోసం పేద దంపతులు ఎదురుచూపులు
- సంధ్యా తల్లిదండ్రుల ఫోన్ నెం. 9502779514
కూలీ పనులు చేసుకొని జీవనం సాగించే కడు పేదల కుటుంబంలో ఓ అంతుపట్టని వ్యాధి కలకలం రేపింది. ఉత్సాహంగా ఉరకలేస్తు చదువుకునే పదేళ్ల బాలికను మంచానికే పరిమితం చేసింది ఆ మాయదారి రోగం. లక్షల రూపాయలు వైద్యం అవసరం కాగా, ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది ఆ పేద కుటుంబం.
వారిదొక మధ్య తరగతి కుటుంబం…భార్యా భర్త..కూలీ పనులు చేసుకుంటూ… వచ్చిన నగదుతో సంతోషంగా జీవిస్తున్నారు.. వారికున్న ఇద్దరు పిల్లల్లో కుమారుడు బుద్దిమాంధ్యంతో ఇంట్లోనే ఉంటుండగా, కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. వారికి ఉన్నంతలో ఆ కుటుంబం సాఫీగా జీవనం గడుపుతున్న తరుణంలో అంతుపట్టని వింత వ్యాధి ఆ కుటుంబంలో కలకలం రేపింది. నిన్న మొన్నటి వరకు ఉత్సాహంగా స్కూల్ కి వెళుతూ…మంచిగా చదువుకుంటూ…పాఠశాలలో మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకున్న వారి కుమార్తె మంచానికే పరిచితమైపోయింది. కుటుంబ ఆర్దిక స్థితిగతులకు మించిన మాయదారి రోగం బారిన వారి బిడ్డ… పడడంతో తమ ముద్దుల కూరుతును బతికించుకునేందుకు ఆ పేద కుటుంబం తల్లడిల్లిపోతోంది.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ పరిధిలోని బండ్లపాళెం గ్రామంలో తుమ్మల శోభన్, అనూష దంపతులు నివాసం ఉంటున్నారు. పేద కుటుంబానికి చెందిన ఈ దంపతులు వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకొని జీవిస్తున్నారు. వీరికి పదేళ్ల వయస్సు కలిగిన కుమార్తె సంధ్యా, ఎనిమిదేళ్ల హేమవరుణ్ అనే కుమారుడు ఉన్నారు.
సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో ఎదురుదెబ్బ తగిలింది… తమ కుమార్తె సంధ్యా గత ఏప్రిల్ లో అనారోగ్యం బారిన పడింది. సాధారణంగా ఏదో చిన్న ఆరోగ్య సమస్య అనుకొని నెల్లూరులోని వైద్యశాలలో చూపించిన ఆ తల్లిదండ్రులకు గుండె పగిలి వార్తను వైద్యులు తెలిపారు. సంధ్యాకు ఎడమ ఊపిరితిత్తులో పెద్ద గడ్డ ఉన్నట్లు గుర్తించి ఆ వ్యాధికి నెల్లూరులో వైద్యం లేదని చెప్పారు. దీంతో తిరుపతి, చెన్నై, విజయవాడ తదితర మహా నగరాల్లో పరీక్షలు చేయించినా సంధ్యాకు ఉన్న వ్యాధికి వైద్యం దొరకలేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో హైదరాబాద్ లోని బసవతారకం హాస్పిటల్ వైద్యులు పరీక్షించి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన గడ్డ ఊపిరి తిత్తులో ఉన్నట్లు గుర్తించారు. అయితే వ్యాధిని గుర్తించగలిగిన హాస్సిటల్ లో ఆ వ్యాధికి తగిన చికిత్స లేకపోవడం ఆ పేద దంపతుల పాలిట శాపంగా మారింది.
చికిత్స అందించకపోయినా పెద్ద మనస్సు చాటుకున్న బసవతారకం హాస్పిటల్ అధినేత, హిందూ పురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ట పేద దంపతుల పరిస్థితి చూసి చలించిపోయారు. సోమిరెడ్డి అభ్యర్థనతో బాలిక ఊపిరితిత్తిలో గడ్డ కరిగేందుకు అవసరమైన మందులను రెండు నెలల పాటు ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ఒక నెలకు ఒక లక్షా 25వేల విలువ చేసే మందులు వాడ్సాలి ఉండగా, అంత స్థోమత లేని ఆ పేద దంపతులు సాయం కోసం అర్ధిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సోమిరెడ్డి, సినిమా హీరో బాలక్రిష్ట సహకారంతో చికిత్స పొందుతున్న సంధ్యాకు మరింత మెరుగైన చికిత్స కోసం దాతలు తమకు సహకరించాలని వారు వేడుకుంటున్నారు. ఆపదలో ఉన్న తమను ఆదుకొని…తమ బిడ్డను బతికించుకునే అవకాశం కల్పించాలని ఆ పేద దంపతులు తల్లడిపోతున్నారు.