పట్టపగలే భారీ వాహనాలతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలింపు
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకూ వాటాలు
పర్మీషన్ ఉందంటూ.. రాత్రి పగలు అక్రమ తవ్వకాలు
పట్టించుకున్న నాథుడే కరువాయే
డక్కిలిలో..గ్రావెల్ మాఫియా..!
పట్టపగలే భారీ వాహనాలతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలింపు
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకూ వాటాలు
పర్మీషన్ ఉందంటూ.. రాత్రి పగలు అక్రమ తవ్వకాలు
పట్టించుకున్న నాథుడే కరువాయే
ఎలాంటి అనుమతులు లేవు.. అయినా.. గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది.. రాత్రి, పగలు తేడా లేకుండా.. ఇష్టారీతిన అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ.. కోట్లు దోచుకుంటున్నారు. ఎవరైనా గ్రామస్తులు, యువకులు ప్రశ్నిస్తే.. తమకు పర్మీషన్లు ఉన్నాయంటూ.. మభ్యపెడతారు. ఎవరికీ ఆ పర్మీషన్లు చూపించరు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. అధికారపార్టీకి చెందిన వాళ్లం అంటూ.. భయపెడుతోంది ఈ మాఫియా. దీంతో అటు అధికారులుగాని.. ఇటు సాధారణ పౌరులుగాని వారి జోలికి వెళ్లడంలేదు. దాంతో ఈ అక్రమ గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది.
తిరుపతి జిల్లా.. వెంకటగిరి నియోజకవర్గం.. డక్కిలి మండలం శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం కు వెళ్లే మార్గంలో.. కుప్పాయపాలెం చెరువు నుండి భారీ వాహనాలతో గ్రావెల్ తరలిపోతోంది. సంబంధిత అధికారులు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులుచ రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కొందరు అధికారపార్టీకి చెందిన వారు కుప్పాయపాళెం చెరువును నిలువునా దోచేస్తూ.. రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, ఇళ్ల స్థలాలకు, ఇతర పొలాల ఫిల్లింగ్‌కు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాలు చేస్తే.. రాజ్యాంగంలోని చట్టాలను సైతం వారిపై మోపి.. కేసులు నమోదుచేస్తామన్న అధికారులే.. ఈ అక్రమార్కులతో చేతులు కలిపి.. వాటాలు పంచుకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కొందరు అధికారపార్టీకి చెందినవారు కూడా ఈ అక్రమ గ్రావెల్ ముఠా చేస్తున్న అక్రమ రవాణాను అడ్డుకోకపోవడంతో.. పలు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈవిషయంలో ఉన్నతాధికారులు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టిసారించి.. ఈ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరారుతున్నారంతా