12 రోజులు ప్రతీ టీడీపీ కార్యకర్త కష్టపడి పని చేశారు
మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
తొలి అడుగులో రూరల్ అగ్రస్థానం…
-12 రోజులు ప్రతీ టీడీపీ కార్యకర్త కష్టపడి పని చేశారు
- మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్రంలోనే రూరల్ అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తొలి అడుగు కార్యక్రమ వివరాలను ఆయన వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సూపరిపాలన తొలి అడుగు దిగ్విజయంగా జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రూరల్ నేతలతో కలసి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ….రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం తొలి అడుగు కార్యక్రమంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 12 రోజుల్లో టిడిపి నాయకులందరు తమ పనులు ప్రక్కన పెట్టి తిరిగారని…వారందరి సమిష్టి కృషితో ప్రధమ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తొలి అడుగు పెట్టిన ప్రతి ఇంటి నుండి ప్రజలు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారన్నారు.