రాష్ట్రస్థాయి నాయకులగురించి మాట్లాడే అర్హత ఎంపీటీసీ రాజాకి లేదు
వైసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఉదయభాస్కర్
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత కొన్ని రోజులుగా ప్రసన్నకుమార్ రెడ్డి పై రౌడీషీటర్ల చేత మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రసన్నకుమార్ రెడ్డిని తిట్టిస్తూ ఆనందం పొందుతున్నారని.. వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అనపల్లి ఉదయబాస్కర్ అన్నారు. ఈమేరకు ఆయన కొడవలూరు మండలం.. నార్త్ రాజుపాళెంలోనీ వీసీఆర్ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేని ఫ్యాక్షని కోవూరు నియోజక వర్గం కి తీసుకు వచ్చిన ఘనత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కె దక్కుతుందని అన్నారు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై 200 మంది ఎమ్మెల్యే మనుషులు దాడి చేసి.. ఒక్క వస్తువు లేకుండా కనీసం కూర్చోవడానికి కూడా వీలు లేకుండా చేశారని దానికోసమే బయట షామియానా వేసి.. ఇంటికి వచ్చిన కార్యకర్తలకు టిఫిన్లు, భోజనాలు పెడుతున్నారేతప్ప.. రాజకీయ స్వలాభం కోసం కదన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల గురించి మాట్లాడే అర్హత ఎంపీటీసీ రాజాకి లేదన్నారు.