మొక్క‌లు నాట‌డం ప్ర‌తి పౌరుని బాధ్య‌త‌

నెల్లూరు న‌గ‌రంలో చిల్డ్ర‌న్స్ ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్‌

ఇమాతే ఇస్లామి హింద్ ఆధ్వ‌ర్యంలో ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌నా ర్యాలీ

మొక్క‌లు నాట‌డం ప్ర‌తి పౌరుని బాధ్య‌త‌
-నెల్లూరు న‌గ‌రంలో చిల్డ్ర‌న్స్ ఇస్లామిక్ ఆర్గ‌నైజేష‌న్‌,
ఇమాతే ఇస్లామి హింద్ ఆధ్వ‌ర్యంలో ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌నా ర్యాలీ

చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో “మట్టిలో చేతులు – హృదయంలో దేశం” నినాదంతో మిలియన్ మొక్కలు నాటే ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం క్రింద ఆదివారం నెల్లూరు న‌గ‌రంలో.. కోట‌మిట్ట నుంచి జెండా వీధి షాదీమంజిల్ వ‌ర‌కు ప్రత్యేక ఎగ్జిబిషన్, అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా చిన్నారులు మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ.. వివిధ ఆకర్షణీయ పోస్టర్లు, మోడల్స్, సందేశాలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుని సమిష్టి బాధ్యత అని ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పారు. ఈ సందర్భంగా సీఐవో రాష్ట్ర ప్రతినిధులు ఫిర్దోస్ అక్తర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో పర్యావరణ ప్రేమ, సామాజిక బాధ్యతల పట్ల చైతన్యం కలిగించాలన్నదే మా ముఖ్య ఉద్దేశమ‌న్నారు. భవిష్యత్తు తరం దిశగా ఇది ఒక చిన్న పగ్గం మాత్రమే.” అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహిస్తూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపే కార్యాచరణకు ఇది నాంది కాబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఓ రాష్ట్ర కమిటీ మెంబర్ అస్మానురేన్, ఆమిర, జమాత్ స్థానిక మహిళా బాధ్యులు మజ్దక్, సఫియా అక్తర్, పెద్ద సంఖ్యలు పిల్లలు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *