మరోసారి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
జగన్ ని, వైసీపీ నేతల్ని హెచ్చరించిన కూటమి నాయకులు, మహిళలు
టిడిపి మండల అధ్యక్షుడు ఏకోలు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
మహిళలకే అంత చులకనా…
- మరోసారి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
- జగన్ ని, వైసీపీ నేతల్ని హెచ్చరించిన కూటమి నాయకులు, మహిళలు
- టిడిపి మండల అధ్యక్షుడు ఏకోలు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యల్ని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. కొత్తూరులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రసన్నపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై…మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట టీడీపీ నేతలు అన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు ఏకొలు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో….కొత్తూరు సాయిబాబా ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలసి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్ల కార్డులు చేతపట్టి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ… మహిళలంటే జగన్ కి, వైసీపీ నేతలకి అంతచులకనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. మరోసారి వైసీపీ నేతలు మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వెంటనే ప్రసన్నపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు..