అంత్యక్రియల్లో పాల్లొంటానని వెల్లడి_
శ్రీనివాసులు హత్యపై స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల
- అంత్యక్రియల్లో పాల్లొంటానని వెల్లడి
జనసేన పార్టీ ఇంచార్జ్ కోటా వినుత వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి కోసం పని చేసిన యువకుడు చనిపోవడం చాలా బాధాకరమన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ కోటా వినుతపై వచ్చిన అభియోగాలపై శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి స్పందించారు.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ కోటా వినుత వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యపై ద్రిగ్భంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కోసం పనిచేసిన యువకుడు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. రాయుడు అంత్యక్రియల్లో నేను పాల్గొంటానని వెల్లడించారు. అదేవిధంగా బంగారుపాలెంలో మామిడి రైతుల గురించి మాట్లాడుతూ… రైతులను కాపాడేటువంటి ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.