డాక్టర్ ఎం. శ్రావణి రెడ్డి_ _ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అప్డేట్ – 2025 CME శిక్షణా కార్యక్రమం_
వైద్య విధానాల్లో ఆధునిక మార్పులు తప్పని సరి…
- డాక్టర్ ఎం. శ్రావణి రెడ్డి
- ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అప్డేట్ – 2025 CME శిక్షణా కార్యక్రమం
నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, జిల్లా పల్మనాలజీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అప్డేట్ – 2025 CME శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రావణి రెడ్డి అధ్యక్షత వహించారు. సుమారు 280 మంది వైద్యులు, పీజి విద్యార్దులు, క్రిటికల్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య రంగంలో అందివస్తున్న సాంకేతికతపై అవగాహన పెంచుకుని తదనుగుణంగా ముందుకెళ్తే రోగులకు మెరుగైన చికిత్సను అందించడంతో పాటూ వారి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు దోహదపడుతుందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎం. శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. పల్మనాలజీ విభాగంలో నేడు మారిన సాంకేతిక చికిత్సా పద్దతులపై ఆమె ఆదివారం నెల్లూరులో “ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అప్డేట్ – 2025 ” కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరుజిల్లా పల్మనాలజీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం మినర్వా గ్రాండ్ హోటల్ లో జరిగింది. డాక్టర్ ఎం. శ్రావణి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా పల్మనాలజీ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ గౌరీనాథ్, డాక్టర్ పిట్టి మల్లిమల్లిఖార్జున పాల్గొన్నారు. వారితో పాటూ రాష్టంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 280 మంది వైద్యులు, పీజి విద్యార్దులు, క్రిటికల్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు. వారు చేసిన అధ్యయనాలు, అనుభవాలను కార్యక్రమంలో పంచుకున్నారు. అనంతరం డాక్టర్ శ్రాణిరెడ్డి, యూనిట్ హెడ్ బాలరాజులు మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ సుజాత, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ, అపోలో హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కే.ఆర్.ఆర్. ఉమా మహేష్, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.