ఈ-ఆటోల పునఃప్రారంభం
ఎమ్మెల్యే విజయశ్రీ చొరవ
-ఈ-ఆటోల పునఃప్రారంభం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పురపాలక సంఘంలో నిరుపయోగంగా ఉన్న E-AUTO లను ఎమ్మెల్యే సూచనలు మేరకు మరమ్మతులు చేసి వంద శాతం ఇంటి ఇంటికి చెత్త సేకరించే పనులకు శ్రీకారం చుట్టారు. పురపాలక సంఘం పరిధిలో దాదాపు 13,500 నివాస గృహాలు ఉండగా.. వీటి ద్వారా రోజుకు సుమారు 23 మెట్రిక్ టన్నుల పొడి, తడి చెత్త ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతము ఇంటి ఇంటికి చెత్తను 83 శాతం పుష్ కార్ట్ ద్వారా స్వీకరించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పురపాలక సంఘంలో నిరుపయోగంగా ఉన్న E-AUTO లను కౌన్సిల్ హకారంతో మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చి.. సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్ కె.చిన్నయ్య ఈ సందర్భంగా కోరారు.