మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరిక_ _కార్పొరేషన్ అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష_
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
- మంత్రి పొంగూరు నారాయణ హెచ్చరిక
- కార్పొరేషన్ అధికారులతో అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
కార్పొరేషన్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలతో నెల్లూరులో అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకి మంత్రి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నెల్లూరును స్మార్ట్ సిటీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ అధికారులతో ,సిటీ టీడీపీ నేతలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు .. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని సమపాళ్లలలో కూటమి ప్రభుత్వం అందిస్తుందని మంత్రి తెలిపారు.. నెల్లూరు నగర కార్పొరేషన్లోనే 830 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.. డ్రైనల్లో పూడికతీత పనులు చేపట్టామన్నారు..అక్టోబర్ ఒకటో తేదీ నాటికి అన్ని పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో కార్పొరేషన్ కమీషనర్ నందన్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్, తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పిటీసీ విజేతా రెడ్డీ ,టీడీపీ నగర అధ్యకక్షులు మామిడాల మధు ,టీడీపీ నేతలు పాల్గొన్నారు