జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్_ _డేవిస్పేటలోని ప్రకృతి వ్యవసాయాన్ని సదర్శన_
సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలి…
- జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్
- డేవిస్పేటలోని ప్రకృతి వ్యవసాయాన్ని సదర్శన
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామంలో యం. డి.యస్ విధానంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగుచేస్తున్న కాయగూరలు, పండ్ల తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయంలో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని, బీర, బెండ, బొప్పాయ, వ్యవసాయ సాగు పద్దతులను పరిశీలించామని చెప్పారు. రసాయనిక ఎరువుల వినియోగం కారణంగా ప్రజలకు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సేంద్రియ ఎరువుల వాడకం, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల వినియోగం కారణంగా ప్రజలకు ఆరోగ్యంతో పాటు జీవిత కాలం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం మునిరత్నం, మార్కెటింగ్ పీఇ కోటేశ్వరరావు, ఎంటీ దాసయ్య, L 1 అనూష, ఐసీపీ పెంచలమ్మ, లక్ష్మి కుమారి, మాధురి, సుమతి, సంధ్య, రైతులు పాల్గొన్నారు..