రొట్టెల పండుగ విజయవంతం_ _నారాయణను సన్మానించి దర్గా కమిటీ సభ్యులు
పవిత్ర గంధాన్ని అందచేసిన కమిటీ సభ్యులు_
మంత్రి నారాయణ కృషితోనే…
- రొట్టెల పండుగ విజయవంతం
- నారాయణను సన్మానించి దర్గా కమిటీ సభ్యులు
- పవిత్ర గంధాన్ని అందచేసిన కమిటీ సభ్యులు
రాష్ట్రపురపాక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను.. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో…
బారాషహీద్ దర్గా సిటీ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గంధ నిర్వాహకులు సయ్యద్ గయాజ్ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ, వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి లను కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. అనంతరం మంత్రికి పవిత్ర గంధాన్ని అందచేశారు. రొట్టెల పండుగ ఏర్పాట్లను ఘనంగా చేయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీ కృషితోనే రొట్టెల పండుగను విజయవంతమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ మాజీ చైర్మన్ షేక్ బాషా ,కార్యవర్గ కార్యదర్శి సయ్యద్ ఖాదర్ బాషా ,దర్గా కమిటీ మెంబర్లు షమీమ్ ,షఫీ ,టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు యాదవ్ ,ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .