దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలి

వైసీపీ మహిళా నాయకురాళ్ల డిమాండ్_ _ప్రసన్న ఇంటిపై దాడి బాధాకరం_

దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలి

  • వైసీపీ మహిళా నాయకురాళ్ల డిమాండ్
  • ప్రసన్న ఇంటిపై దాడి బాధాకరం


ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని వైసీపీ మహిళా నాయకురాళ్లు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేసేందుకు వెళుతున్న మహిళా మణులను అడ్డుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.


మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ…మహిళా నాయకురాళ్లు తీవ్రంగా ఖండించారు. దాడిని నిరసిస్తూ…కోవూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేసేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందచేశారు. అనంతరం స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నాయకురాళ్లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చాలా బాధాకరమనీ తెలిపారు. ఇలాంటి దాడులు గతంలో ఎన్నడూ జరగలేదని ఇటువంటి సంస్కృతికి స్వస్తి చెప్పాలన్నారు. జిల్లాలో గొప్ప పేరున కుటుంబం పై దాడి చేపించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ అధికార ప్రతినిధి మల్లి నిర్మల, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, జిల్లా అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు వెంకట జ్యోతి ,నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకురాలు ప్రవల్లిక ,కోవూరు జడ్పిటిసి కవరగిరి శ్రీలత వీరితోపాటు జిల్లా నియోజకవర్గ వైసీపీ మహిళలు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *