పోలీసుల్ని, సిబ్బందిని ఆదేశించిన చిత్తూరు ఎస్పీ
రొంచిచెర్ల, కల్లూరు పోలీసుస్టేషన్ల ఆకస్మిక తనిఖీ
పెండింగ్ కేసులపై అలసత్వం వద్దు…
- పోలీసుల్ని, సిబ్బందిని ఆదేశించిన చిత్తూరు ఎస్పీ
- రొంచిచెర్ల, కల్లూరు పోలీసుస్టేషన్ల ఆకస్మిక తనిఖీ
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల, కల్లూర్ పోలీస్ స్టేషన్ లను ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సర్కిల్ పరిధిలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంకన్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా పెండింగ్ కేసులపై అలసత్వం వహించవద్దని తెలిపారు.