ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి – కొడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగు
ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్న ఘనత చంద్రబాబుదే
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- కొడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగు
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తపాతోపు,కొడవలూరు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని గడపగడపకు తిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏడాదిపాలన గురించి ప్రజలకు తెలియజేశారు, అనంతరం ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం ఇచ్చిన ఫోన్ యాప్ లో ఎంటర్ చేసుకుని తమ సమస్యలను త్వరితగదన తీరుస్తామని హామీ ఇచ్చారు,ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో ని ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అమలు చేశారని అన్నారు. ఒకటవ పంటలో రైతుల పట్ల చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే హమాలీల తో సహా రైతుల అకౌంట్లో జమ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు, అదేవిధంగా విద్యార్థులకు తల్లికి వందనం,మహిళలకు ఉచిత గ్యాస్ లాంటి కార్యక్రమాలు చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు, జీవీఎం శేఖర్ రెడ్డి, కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి,గ్రామపార్టీ అధ్యక్షులు జిలాని బాషా, పంది శ్రీనివాసులు, నీటి సంఘం అధ్యక్షులు నక్క రమణయ్య, కోవూరు వెంకీ, తువ్వర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.