ఆంధ్రజ్యోతి ఫోటోగ్రఫర్ పై దాడి దారుణం
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
నెల్లూరులో జర్నలిస్టుల ఆందోళన
- ఆంధ్రజ్యోతి ఫోటోగ్రఫర్ పై దాడి దారుణం
- దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి
చిత్తూరు జిల్లా జగన్ పర్యటనలో ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడిని నెల్లూరు జిల్లా తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలంటూ… నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద జర్నలిస్టులు ఆందోళన, ధర్నా చేపట్టారు. పలు పత్రికలు, మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. వారంతా జగన్, వైసీపీ గూండాలకి వ్యతిరేఖంగా పెద్దపట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మహేష్, మల్లికార్జున, వీడియో గ్రఫర్ షాహిద్ లు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడి హేయమైన చర్య అన్నారు. జర్నలిస్టుల రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారించాలని కోరారు.