_సాయిబాబా వారికి విశేష అభిషేకాలు_
వైభవంగా గురు పౌర్ణమి…
- సాయిబాబా వారికి విశేష అభిషేకాలు
నెల్లూరు నగరం చిల్డ్రన్స్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సాయిబాబా వారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించి తరించారు. సాయినాథ్ మహరాజ్ కి జై అని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.