దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలి_
కుప్పంలో జర్నలిస్టుల నిరసన..
- దాడికి పాల్పడిన వెంటనే అరెస్ట్ చేయాలి
మాజీ సీఎం జగన్ బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా విలేకరిపై దాడిని నిరసిస్తూ…చిత్తూరు జిల్లా కుప్పంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కడ కార్యాలయం వద్ద నుంచి అర్బన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. జర్నలిస్టుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేస్తూ డీఎస్పీ పార్థసారధికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పాల్గొన్నారు..