సంగంలో ఘనంగా మంత్రి ఆనం జన్మదిన వేడుకలు
బస్టాండు సెంటర్లో కేక్ కట్ చేసిన తెలుగు తమ్ముళ్లు_
ఆత్మకూరు అభివృద్ధి ఆనంకే సాధ్యం…
- సంగంలో ఘనంగా మంత్రి ఆనం జన్మదిన వేడుకలు
- బస్టాండు సెంటర్లో కేక్ కట్ చేసిన తెలుగు తమ్ముళ్లు
నెల్లూరు జిల్లా సంగంలో మండల టిడిపి నాయకులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్ స్టాండ్ సెంటర్ లో బాణాసంచాలు కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ఆనం రామనారాయణరెడ్డి తోనే సాధ్యమని వారు అన్నారు. ఆయన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి ,సంగం సొసైటీ త్రీ మెన్ కమిటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి,కోటు కరుణాకర్ రెడ్డి,టీడీపీ నాయకులు చేవూరు జనార్దన్ రెడ్డి,ముత్యాల విజయ్ చంద్ర,పగడాల రఘురామయ్య,సూరా శ్రీనివాసులు రెడ్డి,షేక్ బాబు,కర్నాటి చరణ్ రెడ్డి,కాకు మధు,చల్లా నాగరాజు, ఉక్కాల శ్రీనివాసులు,పట్టాభిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు