వైసీపీ నేతలు ప్రసన్న భాషని ఖండించాలి_ _మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం_ _నియోజకవర్గంలో తిరగనీయం_ _మాజీ మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కోవూరు టీడీపీ నేతలు_
ప్రసన్న ఎపిసోడ్ కి ఆయనే ఇన్చార్జి…
- వైసీపీ నేతలు ప్రసన్న భాషని ఖండించాలి
- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
- నియోజకవర్గంలో తిరగనీయం
- మాజీ మంత్రులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కోవూరు టీడీపీ నేతలు
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవూరు టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెముకుల కృష్ణ చైతన్య, వీరేంద్ర, మల్లారెడ్డిలు మాజీ మంత్రులు అనిల్, ప్రసన్నలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపరెడ్డి చేసిన వ్యాఖ్నల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముందు ప్రసన్న భాషని వైసీపీ నేతలు ఖండించాలని హితవు పలికారు. మరోసారి మహిళలపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని…నియోజకవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు.