_ఇంతటి గొప్ప పండుగలో పాల్గొనడం సంతోషం_ _బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్_
ఆరోగ్య రొట్టె పట్టుకున్న ఉండవల్లి
- ఇంతటి గొప్ప పండుగలో పాల్గొనడం సంతోషం
- బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసిన మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్
గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవం బారాషహిద్ దర్గా రొట్టెల పండగ అని రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఆమె పాల్గొన్నారు. దర్గాలోని బారాషాహిదులను దర్శించుకున్న ఆమెకు ముజావర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టెను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నెల్లూరు రొట్టెల పండుగకు 400 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉందని, ఇటువంటి గొప్ప పండుగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను ప్రగాఢ విశ్వాసంతో ఆరోగ్యరొట్టెను పట్టుకున్నానని, తిరిగి వచ్చే ఏడాది రొట్టెను వదులుతానని ఆమె చెప్పారు. రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.