చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి_ _వైసీపీ శ్రేణులకి పిలుపునిచ్చిన నాయకులు
కందుకూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ_
రాబోయే రోజుల్లో జగనే సీఎం…
- చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- వైసీపీ శ్రేణులకి పిలుపునిచ్చిన నాయకులు
- కందుకూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ
నెల్లూరు జిల్లా కందుకూరులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం స్థానిక ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకట రెడ్డి, కందుకూరు ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని… రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జగనన్న పరిపాలనలో కార్యకర్తలకు పూర్తి భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ పై గడపగడపకు తీసుకెళ్లాలని చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక టిడిపి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అవినీతిపై మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిలో కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ఇందుకు నిదర్శనం నియోజకవర్గంలోని గుడ్లూరు దొరికిన నకిలీ మద్యం తయారు చేస్తు దొరికిన ముఠామే నిదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.