ఆందోళనలో మత్స్యకారులు_ _చేపల వేటకు పాల్పడితే కఠిన చర్యలు_ _ఎఫ్డీవో సురేష్ బాబు హెచ్చరిక_
జోరుగా చేపల వేట…
- ఆందోళనలో మత్స్యకారులు
- చేపల వేటకు పాల్పడితే కఠిన చర్యలు
- ఎఫ్డీవో సురేష్ బాబు హెచ్చరిక
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో జోరుగా చేపల వేట సాగుతుంది. జులై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు అధిక సంఖ్యలో చేపలు గుడ్డు దశలో ఉంటాయి. చేపల ఉత్పత్తికి ఈ కాలం చాలా విలువైనది కావడంతో పటిష్టంగా అధికారులు నిషేధాజ్ఞలు అమలు చేయవలసి ఉంది. జలాశయ పరిసర ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యదేచ్చగా అక్రమ చేపల వేటకు బడా వ్యాపారస్తులు తెరలేపుతున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిషేధాజ్ఞలు అమలు కాకపోతే రానున్న రోజుల్లో తమ జీవన ఉపాధి కోల్పోతామని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎఫ్డిఓ సురేష్ బాబును వివరణ కోరగా.. అక్రమ చేపల వేటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జలాశయం వద్ద స్థానిక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.