_అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
వాకాడులో నిరసన తెలిపిన అంగన్వాడీ వర్కర్లు, కార్మికులు
ఏళ్లు గడుస్తున్నా గుర్తింపు లేదు…
- అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
- వాకాడులో నిరసన తెలిపిన అంగన్వాడీ వర్కర్లు, కార్మికులు
తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు సీఐటీయూ నాయకులతో కలసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల మాట్లాడుతూ…ఐసీడీఎస్ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా…అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించలేదని అన్నారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వడంతోపాటు…అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం డిప్యుటీ తహసీల్దార్ సందీప్ కుమార్ కు వినతి పత్రం అందచేశారు ఈ కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్తలు , హెల్పర్లు , ఆశ వర్కర్లు పాల్గొన్నారు.