ముగ్గురికి స్వల్ప గాయాలు_ _గూడూరు రూరల్ లో ఘటన_
కల్వర్టులో ఆటో బోల్తా…
- ముగ్గురికి స్వల్ప గాయాలు
- గూడూరు రూరల్ లో ఘటన
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తప్పించబోయి పక్కనే ఉన్న కల్వర్టులోకి అదుపుతప్పి ఆటో బోల్తా పడిన ఘటన… తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు…గూడూరు నుంచి విందూరు మార్గంలో వెళ్లే రహదారి భారీ గుంతల కారణంగా ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ తోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ రోడ్డు అధ్వానంగా ఉందని…అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.