ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం

మ‌హిళ‌ల‌కు పండ‌గే – గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను నిర్వీర్యం చేశారు

క‌నుపూరులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో సోమిరెడ్డి

ఆగ‌స్టు 15 నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం
మ‌హిళ‌ల‌కు పండ‌గే
గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ శాఖ‌ల‌ను నిర్వీర్యం చేశారు
క‌నుపూరులో సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కనుపూరు గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు కనుపూరు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సుపరిపాలన లో తొలి అడుగు మేనిఫెస్టో, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలకు వివరిస్తూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు 4000 అందిస్తున్నామని.. రాబోయే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లు నిర్వీర్యం చేశారని.. గ‌డిచిన సంవత్సర కాలంగా అన్ని డిపార్ట్మెంట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిన పెడుతున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *