ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
పండ్ల తోట పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం
ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్
వింజమూరు మండలం నందిగుంట గ్రామంలో మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం లో భాగంగా రైతు కోట ఎరుకల రెడ్డి పొలంలో నిమ్మ చెట్లను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ నాటడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పండ్ల తోటకు పెంపకం, ఒక బృహత్తర కార్యక్రమంగా ఉదయగిరి నియోజకవర్గం లో దాదాపుగా 759 ఎకరాల్లో ఈ పండ్ల తోట పెంపకాన్ని చేపడుతున్నట్లు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వింజమూరు మండలంలో 150 ఎకరాలకు ప్రతిపాదన వచ్చిన సందర్భంగా , నందిగుంట గ్రామంలోనీ రైతు పొలంలో నాటడం జరిగిందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల వెంట అనునిత్యం పనిచేస్తుందని,ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ నరసారెడ్డి,ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి,ఏపిడి మృదుల, ఈసీ కృష్ణారావు, టి ఏ మురళి,ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్,టీడీపీ సీనియర్ నాయుకులు, రైతులు పాల్గొన్నారు.