కోవూరులో ఓడించినా.. సిగ్గురాలేదా..?

మ్మెల్యే వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు

ప్రసన్న వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి_ _జనసేన నాయకుల డిమాండ్_

కోవూరులో ఓడించినా.. సిగ్గురాలేదా..?
-ఎమ్మెల్యే వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు

  • ప్రసన్న వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి
  • జనసేన నాయకుల డిమాండ్

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పై మాజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని జనసేన రాష్ట్ర కార్యదర్శులు ప్రియా సౌజన్య, సుభాషిణి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ కడలి ఈశ్వరి లు అన్నారు. మంగళవారం మాగుంటే లేఔట్ లోని జనసేన నగర కార్యాలయంలో ఆ పార్టీ నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వ‌ర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే ప్రశాంత్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసన్న చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఒక మహిళ ఎమ్మెల్యే పై వ్యక్తిగత హననం చేయటం కించపరిచే మాటలు మాట్లాడటం దుర్మార్గం అన్నారు. మన ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు కదా.. వారిపై కూడా ఇలాంటి భాష మాట్లాడితే మీరు సహిస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించినా వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని మండి పడ్డారు. ప్రసన్నకుమార్ రెడ్డికి కోవూరు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాలేదని, మహిళలపై దిగజారిన మాటలు విన్న ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఉందని, ప్రసన్నకుమార్ లాంటి నేతలను రాజకీయాల్లో నుంచి బహిష్కరించాలని ఆయన వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బొబ్బేపల్లి సురేష్, కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి చప్పిడి శ్రీనివాసుల రెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, నగర మరియు రూరల్ డివిజన్ ఇంచార్జులు , నాయకులు , వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *