2029లో వ‌చ్చేది వైసీపీనే..!

నెల్లూరులో రీకాలింగ్‌.. చంద్ర‌బాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్క‌రించిన మిథున్‌రెడ్డి_ _కూట‌మి ప్ర‌భుత్వ దారుణాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి_ _మిథున్‌రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్‌_

2029లో వ‌చ్చేది వైసీపీనే..!

నెల్లూరులో రీకాలింగ్‌.. చంద్ర‌బాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్‌ను ఆవిష్క‌రించిన మిథున్‌రెడ్డి
కూట‌మి ప్ర‌భుత్వ దారుణాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి

మిథున్‌రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాద‌వ్‌

వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్, యం పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్న మోసాలపై…రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో జిల్లా స్థాయి కార్యక్రమం నెల్లూరులోని డీఆర్ ఉత్త‌మ హోట‌ల్‌లో ఘ‌నంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ‌,
నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి, నెల్లూరు సిటి నియోజకవర్గ ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, మాజీ మంత్రి, పీఏసీ మెంబర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితలు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో QR కోడ్ ను వైఎస్ఆర్సిపి నేతలతో కలిసి, యం పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాలు, అలాగే వైసిపి నేతలపై పెడుతున్న అక్రమ కేసులు.. వారి ఆస్తుల విధ్వంశానికి పాల్పడుతున్న విధానాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు వివరించాల‌ని మిథున్‌రెడ్డి కోరారు. అనంత‌రం మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌లు మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *