_కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న
ఆగ్రహించిన తమ్ముళ్లు..?_ _నెల్లూరులోని ఆయన నివాసం ధ్వంసం
ప్రసన్న ఇంటిపై దుండగుల దాడి..!
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న
ఆగ్రహించిన తమ్ముళ్లు..?
నెల్లూరులోని ఆయన నివాసం ధ్వంసం
కోవూరు రాజకీయం రాజుకుంది.. ఏడాది కాలంగా ఉప్పు.. నిప్పులా ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ.. రాజకీయం చేస్తున్నారు. అయితే.. తాజాగా.. సోమవారం కోవూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్నకుమార్‌రెడ్డి… ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తి గత విమర్శలు చేశారు. చివరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపైనా విమర్శలు చేశారు. దాంతో రాత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని దుండగలు ఆగ్రహించారు. పెద్ద సంఖ్యలో కొండాయపాళెం గేటు సమీపంలోని ప్రసన్న ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లోని వస్తువులు, ఫర్నీచర్, ఇతర విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. బయట ఉన్న కారును కూడా ధ్వంసం చేసి.. ఆ కారును బోల్తా పడేశారు. ఈ దాడి విషయం జిల్లాలో దావానంలా వ్యాపించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోవూరులో ఉన్న ప్రసన్న హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. అలాగే..ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రూరల్ ఇన్‌ఛార్జి ఆనం జయకుమార్‌రెడ్డి, తదితర ముఖ్యనేతలు అక్కడకు చేరుకుని పరిశీలించారు. టీడీపీ వాళ్లే ఈ చర్యకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఇదో పరికిపంద చర్య అన్నారు. ఓ మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచితంగా.. వ్యక్తిగత విమర్శలు చేయడం జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా…ఈ దుండగుల దాడితో నెల్లూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కోవూరులో అయితే హాట్ టాపిగ్గా మారింది.