కోవూరు వైసీపీ కేడ‌ర్‌లో ఉత్సాహం

ప్ర‌స‌న్న ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశం

భారీగా త‌ర‌లి వ‌చ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు

కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చిన నేత‌లు

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌పై మండిప‌డ్డ ప‌ర్వ‌త‌రెడ్డి, అనిల్‌, ప్ర‌స‌న్న‌

కోవూరు వైసీపీ కేడ‌ర్‌లో ఉత్సాహం
ప్ర‌స‌న్న ఆధ్వ‌ర్యంలో నియోజ‌క‌వ‌ర్గ విస్తృత స్థాయి స‌మావేశం
భారీగా త‌ర‌లి వ‌చ్చిన వైసీపీ శ్రేణులు, అభిమానులు
కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చిన నేత‌లు

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌పై మండిప‌డ్డ ప‌ర్వ‌త‌రెడ్డి, అనిల్‌, ప్ర‌స‌న్న‌

కోవూరు మండలం చిన్నపడుగుపాడులోని రుక్మిణి కళ్యాణ మండపంలో మాజీ ముఖ్యమంత్రి, జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా వైసీపీ శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పిఏసీ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే వెంకట రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని సాయిబాబా గుడి వద్ద నుండి మండల మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. భ‌విష్య‌త్తులో చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాలు, కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు, అమ‌లు కాని ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేసేలా ప్ర‌తి ఒక్క‌రూ ముందుకెళ్లాల‌ని జ‌గ‌న్ సూచించారు. అనంత‌రం ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌, మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మ‌న్ వీరి చ‌ల‌ప‌తిరావులు మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, లోకేష్‌ల తీరుపై మండిప‌డ్డారు. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను ఉత్తేజ‌రిచేలా ప్ర‌సంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *