సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద అభిమానాన్ని చాటుకున్న తెలుగు తమ్ముళ్లు
లోకేష్ కి గ్రాండ్ వెల్ కమ్
- సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద అభిమానాన్ని చాటుకున్న తెలుగు తమ్ముళ్లు
నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నెల్లూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళుతున్న లోకేష్ కాన్వాయ్ ను నిలిపి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేష్ కు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతో సన్మానించారు. లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు లోకేష్ అభివాదం చేస్తూ కరచలం చేశారు. లోకేష్ రాకతో భారీగా బాణసంచా కాల్చారు.