పొరపాట్లు మళ్లీ జరగనీయద్దు

నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం

చెబితే వినడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు

ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్

పొరపాట్లు మళ్లీ జరగనీయద్దు…

  • నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం
  • చెబితే వినడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు
  • ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్


నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగనీయవద్దని, నాయకులు, కార్యకర్తలు ఏదైనా చెబితే వినేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అనిల్ గార్డెన్స్ లో జరిగిన టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ ఈ కామెంట్స్ చేశారు.


గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగనీయద్దని… తప్పులు జరిగితే సరిదిద్దుకుంటామని…రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మినిస్టర్ ఫరూక్, మంత్రులు నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్ధుల్ అజీజ్, టీడీపీ ముఖ్య నేతలతో కలసి మంత్రి లోకేష్ ముఖ్య అతిధిగా పాల్గొని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ….కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నెలాఖరులోగా ఎఎంసిలు, దేవాలయ కమిటీల కూర్పు పూర్తిచేస్తామని చెప్పారు. కోటి మంది సభ్యులుగల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. సొంత కార్యకర్తలను కారుకింద తొక్కేసిన నేత రాష్ట్రంలో ఉన్నారని జగన్ పై విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఆలోచించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర,నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *