10న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0

తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలి

మెగా టీచర్స్ పేరెంట్ సమావేశంలో స్కూలు అభివృద్ధి కమిటీ మెంబర్లు విధిగా పాల్గొనాలి

జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపు_

10న జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0

  • తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలి
  • మెగా టీచర్స్ పేరెంట్ సమావేశంలో స్కూలు అభివృద్ధి కమిటీ మెంబర్లు విధిగా పాల్గొనాలి
  • జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపు


జులై 10వతేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా్ కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్న వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఒకసారి ఈ మీటింగ్ ను నిర్వహించామని, రెండోసారి ఈనెల 10న జిల్లావ్యాప్తంగా 3600 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు 143 కళాశాలలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మీటింగ్ రోజున విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, విద్యార్థుల బోధన సామర్ధ్యాలను వారికి ఉపాధ్యాయులు తెలియజేస్తారన్నారు. జిల్లాలో సుమారు మూడున్నర లక్షల మంది విద్యార్థులు మన విద్యా వ్యవస్థలో విద్యను అభ్యసిస్తున్నారని, వారి ప్రతిభ పాటవాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పకుండా కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *