బాబు గారు ఆరోగ్యగంగా ఉంటే..రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టె పట్టుకున్న మంత్రి నారా లోకేష్
నాన్న కోసం ఆరోగ్య రొట్టె…
- బాబు గారు ఆరోగ్యగంగా ఉంటే..రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
- స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టె పట్టుకున్న మంత్రి నారా లోకేష్
నెల్లూరు బారాషహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోగ్యం బాగుండాలని ఆయన స్వర్ణాల ఆరోగ్య రొట్టె పట్టుకున్నారు. మంత్రి నారాయణకి రొట్టెని తినిపించారు.
బాబు గారు ఆరోగ్యగంగా ఉంటే..రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని…అందుకనే ఆరోగ్య రొట్టె పట్టుకున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు బారా షహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఆయన పాల్గొన్నారు. భక్తులందరిని ఆయన ఆప్యాయంగా పలకరించారు.
బారాషహీద్ దర్గాను దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలతో కలసి ఆరోగ్య రొట్టెను పట్టుకుని మంత్రి నారాయణకు తినిపించారు. అనంతరం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. రొట్టెల పండుగను టీడీపీ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. మంత్రి వెంట మంత్రి నారాయణ, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మహ్మద్ ఫరూక్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.