వైసీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
రూరల్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు
తన కుమారుడిపై దాడి చేశారు
- వైసీపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
- రూరల్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు
తన కుమారుడిపై వైసీపీ యువజన విభాగం నాయకులు దాడి చేసి కత్తులతో బెదిరించారని…రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు శ్రీపతి రాము ఆరోపించారు. ఈ మేరకు ఆయన జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ తదితరులతో కలసి రూరల్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి తన కుమారుడిపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం శ్రీపతి రాము, మల్లికార్జున యాదవ్ లు ఎన్ 3 న్యూస్ తో మాట్లాడి…ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.