రొట్టె ప‌ట్టుకోవ‌డం.. కోరిన కోర్కెలు..తీరిన మొక్కులు తీర్చుకోవ‌డ‌మే

రొట్టెల పండుగ‌కు ముస్తాబైన బారాషాహిద్ ద‌ర్గా

స‌ర్వం సిద్ధం చేసిన పాల‌కులు, అధికారులు, ద‌ర్గా క‌మిటి

దగ‌ద‌గ.. క‌ళ్లు మిరిమిట్లుగొలిపేలా లైటింగ్‌

రెండు రోజుల ముందే మొద‌లైన భ‌క్తుల తాకిడి

ద‌ర్గాలు, బీచ్‌ల వ‌ద్ద సంద‌డి

రొట్టె ప‌ట్టుకోవ‌డం..
కోరిన కోర్కెలు..తీరిన మొక్కులు తీర్చుకోవ‌డ‌మే..!

రొట్టెల పండుగ‌కు ముస్తాబైన బారాషాహిద్ ద‌ర్గా
స‌ర్వం సిద్ధం చేసిన పాల‌కులు, అధికారులు, ద‌ర్గా క‌మిటి
దగ‌ద‌గ.. క‌ళ్లు మిరిమిట్లుగొలిపేలా లైటింగ్‌
రెండు రోజుల ముందే మొద‌లైన భ‌క్తుల తాకిడి

ద‌ర్గాలు, బీచ్‌ల వ‌ద్ద సంద‌డి

ఈనెల 6వ తేదీ నుంచి ఐదు రోజుల‌పాటు జ‌ర‌గ‌నున్న రొట్టెల‌పండుగ‌కు నెల్లూరు బారా షాహిద్ ద‌ర్గా ముస్తాబైంది. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో.. ద‌ర్గా క‌మిటీ, నెల్లూరు కార్పోరేష‌న్ ఆధ్వ‌ర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ ఇప్ప‌టికే ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఇత‌ర నిబంధ‌నులు విధించారు. ద‌ర్గా ఆవ‌ర‌ణంలో పెద్ద ఎత్తున లైటింగ్‌, డెక‌రేష‌న్, మిరుమిట్లు గొలిపే భారీ అలంక‌ర‌ణ‌ల‌తో ద‌ర్గా ఆవ‌ర‌ణం ముస్తాబైంది. రొట్టెల పండుగ మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నా.. మందుగానే ఇత‌ర రాష్ట్రాలు, జిల్లాల నుంచి భ‌క్తులు, సంద‌ర్శ‌కులు ద‌ర్గాకు చేరుకుంటున్నారు. బారాషాహిద్‌ల‌వ‌ద్ద పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. స్వ‌ర్ణాల చెరువులో రొట్టెలు సైతం ప‌ట్టుకుంటున్నారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తులు జిల్లాలోని ముఖ్య ప్రాంతాల‌కూ వెళ్తున్నారు. ముఖ్యంగా క‌సుమూరు, ఏఎస్ పేట, వేనాడు ద‌ర్గాల‌తోపాటు ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు మైపాడు, కోడూరు, రామ‌తీర్థం బీచ్‌ల వ‌ద్ద సంద‌డి మొద‌లైంది. ఆదివారం నుంచి మొద‌లు కానున్న రొట్టెల పండుగ‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రూర‌ల్ ఎమ్మెల్యే సోద‌రుడు, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *