ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ కారు – ముగ్గరుకి గాయాలు
మోటారు బైక్ ని తప్పించబోయి…
- ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తాపడ్డ కారు
- ముగ్గరుకి గాయాలు
ఓ మోటారు బైక్ ని కారు తప్పించబోయి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన సంఘటన… నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు…నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్తున్న కారు చెరువు కట్ట రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ని తప్పించబోయి ముళ్లపోదల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.