-ఎంత మంది ఉన్నా తల్లికి వందనం అమలు.
నారికేళ్ళపల్లి లో సుపరిపాలన లో తొలి అడుగు.
పాల్గొన్న సోమిరెడ్డి, పనబాక, నర్సింహ యాదవ్.
మూడు రెట్లు ఖర్చు చేయబోతున్నాము.
ఎంత మంది ఉన్నా తల్లికి వందనం అమలు.
నారికేళ్ళపల్లి లో సుపరిపాలన లో తొలి అడుగు.
పాల్గొన్న సోమిరెడ్డి, పనబాక, నర్సింహ యాదవ్.
రాబోయే నాలుగు సంవత్సరాలతో కలుపుకుని వైసీపీ ప్రభుత్వం కంటే నాలుగు రెట్లు ఖర్చు చేయబోతున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా…ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లెలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం జరిగింది. టిటిడి బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నర్సింహ యాదవ్ తదితరులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామానికి వచ్చిన నాయకులకు స్తానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ప్రతీ ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ది గురించి వివరించే కరపత్రాలు అందేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…ప్రతీ ఇంటి లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా తల్లికి వందనం నగదు జమ చేయడం జరుగుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళితే ముగ్గురు చనిపోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పనబాక లక్ష్మీ, నర్సింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు బాబి రెడ్డి, అక్కయ్యగారి ఏడుకొండలు, దువ్వూరు గోపాల్ రెడ్డి, సుంకర శ్రీనివాస్ యాదవ్,నారికేళ్ళపల్లి టీడీపీ నాయకులు కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు .