నెల్లూరులోకి భారీ వాహ‌నాల‌కు నో ఎంట్రీ

5వ తేదీ నుంచి 10వ తేదీవ‌ర‌కు పోలీస్ ఆంక్ష‌లు

కేవీఆర్ పెట్రోల్ బంక్‌_డీకేడ‌బ్ల్యూ రోడ్డు క్లోజ్‌

రొట్టెల‌పండుగ నేప‌థ్యంలో కేవీఆర్ పెట్రోల్ బంకు ప్రాంతంలో స్వ‌యంగా

త‌నిఖీలు నిర్వ‌హించిన జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్‌

నెల్లూరులోకి భారీ వాహ‌నాల‌కు నో ఎంట్రీ..!

-5వ తేదీ నుంచి 10వ తేదీవ‌ర‌కు పోలీస్ ఆంక్ష‌లు
-కేవీఆర్ పెట్రోల్ బంక్‌_డీకేడ‌బ్ల్యూ రోడ్డు క్లోజ్‌
-రొట్టెల‌పండుగ నేప‌థ్యంలో కేవీఆర్ పెట్రోల్ బంకు ప్రాంతంలో
స్వ‌యంగా త‌నిఖీలు నిర్వ‌హించిన జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్‌

నెల్లూరు బారాషాహిద్ ద‌ర్గా రొట్టెల పండుగ నేప‌థ్యంలో.. నెల్లూరుకు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా.. జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఈనెల 5వ తేదీ నుంచి 10వ తేదీవ‌ర‌కు.. కేవీఆర్ పెట్రోలు బంకు.. డీకేడ‌బ్ల్యూ రోడ్డును క్లోజ్ చేస్తున్నారు. ఇందుకోసం గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ స్వ‌యంగా కేవీఆర్ పెట్రోలు బంకు ప్రాంతాన్ని ప‌రిశీలించారు. అక్క‌డి నుంచి ద‌ర్గా వ‌ర‌కు.. ఆర్టీసీ, అయ్య‌ప్ప‌గుడి త‌దిత‌ర ప్రాంతాల వ‌ర‌కు వెళ్లి.. ట్రాఫిక్‌కు ఇబ్బందుల్లేకుండా.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో పోలీసు అధికారులు, సిబ్బందితో చ‌ర్చించారు. ఈ ఆంక్ష‌ల్లో భాగంగా.. గూడూరు వైపు నుంచి వచ్చే ఆర్టీసి బస్సులు, వాహ‌నాలు.. అయ్యప్పగుడి ఫ్లైఓవర్, అన్నమయ్య సర్కిల్, ఏసి మార్కెట్ మీదుగా బస్టాండ్ కు వెళ్లాలని.. పొదలకూరు రోడ్డు వైపు నుంచి వచ్చే బస్సులు, వాహ‌నాలు డైకాస్ రోడ్డు, అన్నమయ్య సర్కిల్, ఏసి మార్కెట్ మీదుగా వెళ్లాల‌ని.. జొన్నవాడ నుంచి వచ్చే వాహ‌నాలు, బస్సులు గాంధీ బొమ్మ, ములుమూడి బస్టాండ్ మీదుగా వెళ్లాల‌ని.. రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. లారీలు, టిప్ప‌ర్లు, ఇత‌ర భారీ వాహ‌నాలేవీ.. ఆంక్ష‌లు విధించిన తేదీల్లో ఆ మార్గాల్లో నిషేదించిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ఎస్పీ తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *