ప్రజలకి రుణపడి ఉంటాం – టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
విజయవంతంగా ముగిసిన శంకర నేత్రాలయ కంటి వైద్యశాల ఉచిత వైద్య శిబిరం
సౌత్ మోపూరుకి ఎంత చేసినా తక్కువే
- ప్రజలకి రుణపడి ఉంటాం
- టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
- విజయవంతంగా ముగిసిన శంకర నేత్రాలయ కంటి వైద్యశాల ఉచిత వైద్య శిబిరం
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో శంకర నేత్రాలయ కంటి వైద్యశాల, చెన్నై కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి -శ్రీమతి శోభారెడ్డిల సౌజన్యంతో ఉచిత కంటి శుక్లం శస్త్ర చికిత్స శిబిరం బుధవారంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆయనకి గ్రామ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు ఘన స్వాగతం పలికారు. కంటి వైద్య శిబిరాన్ని కోటంరెడ్డి సందర్శించారు. ప్రజలకి అందిస్తోన్న వైద్య సేవల్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరురూరల్ నిరుపేదలందరికి ఉచితంగా కంటి వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని…శంకర నేత్రాలయ చెన్నై యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కంటి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వాళ్లకు కంటి అద్దాలను ఆయన పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ నేత గిరిధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పముుజుల దశయ్యలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు