గ్రామంలో ఇంటింటికెళ్లి ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
విడవలూరులో సుపరిపాలనలో తొలి అడుగు
- గ్రామంలో ఇంటింటికెళ్లి ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
ఎన్నికల ప్రచారం ఎక్కడి నుండి ప్రారంభించామో అక్కడి నుండే సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని రామచంద్రపురం, రామతీర్థం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభివృద్ధి గురించి వివరించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రశాంతమ్మ పలకరింపుతో తీరప్రాంతాల ప్రజలు పరవశించిపోయారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గ్రామంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశ పెట్టి సుపరిపాలన అందిస్తోన్న చంద్రబాబు పాలన బాగుందని ప్రజలు మంచి ప్రభుత్వం అని అనటం ఎంతో సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి, ఆవుల వాసు,ఉప్పాల వెంకటరమణయ్య, తాత రమేష్, మాడ నరేంద్ర,ఉప్పాల సీనయ్య స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.