నెల్లూరు 13వ డివిజన్లో్ పర్యటించిన మంత్రి నారాయణ
ఇంటింటికెళ్లి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ
ఇంటింటికి టీడీపీ…
- నెల్లూరు 13వ డివిజన్లో్ పర్యటించిన మంత్రి నారాయణ
- ఇంటింటికెళ్లి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ
కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 13వ డివిజన్లోని యలమవారిదిన్నెలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. డివిజన్లోని ఇంటింటికీ వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మంత్రి ప్రజలకు వివరించారు. మంత్రికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ… 13వ డివిజన్ లోని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల గురించి వివరించే క్రమంలో ప్రజలు చూపుతున్న ఆదరణ మరువలేనిదని తెలియజేశారు. ప్రతీ ఇంటికి మూడు, నాలుగు ప్రభుత్వ పధకాలు చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేవని తెలిపారు. సీఎం పిలుపుతో మార్గదర్శకులు ముందుకొస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు ఓపిక పడితే మానిఫెస్టో హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్లపాక అనూరాధ ,మాజీ జెడ్పిటిసీ విజేతా రెడ్డి .డివిజన్ నాయకులు కాయల తిరుపతి ,ఊటుకూరు చంద్ర ,కాయల ప్రసాద్ ,కాయల కృష్ణ తదితరులు పాల్గొన్నారు .