క‌లెక్ట‌ర్ భార్య కాన్పు చేయించుకుంద‌ని ఆ.. ఆసుప‌త్రికి కాన్పుకు వెళ్తే

వైద్యుల నిర్ల‌క్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి

ఆ దావాఖానావ‌ద్ద ఆందోళ‌న‌

క‌లెక్ట‌ర్ భార్య కాన్పు చేయించుకుంద‌ని
ఆ.. ఆసుప‌త్రికి కాన్పుకు వెళ్తే..!

వైద్యుల నిర్ల‌క్ష్యంతో పురిటిలోనే బిడ్డ మృతి

ఆ దావాఖానావ‌ద్ద ఆందోళ‌న‌

కొత్త‌గూడెం.. జిల్లా క‌లెక్ట‌ర్ స‌తీమ‌ణి ఆ ప్ర‌భుత్వ దావాఖానాలో ప్ర‌స‌వించింది.. జిల్లాకు క‌లెక్ట‌ర్ అయి ఉండి కూడా.. త‌న భార్య‌కు ప్ర‌భుత్వ దావాఖానాలోనే ప్ర‌స‌వం చేయించిన ఆ క‌లెక్ట‌ర్‌ను అంతా మెచ్చుకున్నారు. ఆ ఆసుప‌త్రిలో ప‌నిచేసే వైద్య సిబ్బంది ఎంతో నైపుణ్యంగ‌ల‌వార‌ని.. ఆధునిక ప‌రిక‌రాలున్నాయ‌ని.. ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు ఏమాత్రం తీసిపోవ‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ అంటూ.. అటు జిల్లా ప్ర‌జానికం.. ఇటు ప‌త్రిక‌లు, మీడియా ప్ర‌శంశించాయి. ఇది జిరిగి.. రోజులు గ‌డ‌వ‌క ముందే.. ఆ దావాఖానాలో సుఖ ప్ర‌స‌వం చేస్తార‌ని.. త‌ల్లిబిడ్డ‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. నిన్న డాక్ట‌ర్స్ డే రోజున‌.. కొత్త‌గూడెం జిల్లా.. ల‌క్ష్మీదేవిప‌ల్లి మండ‌లం.. తోక‌బంగారం గ్రామానికి చెందిన నిండు గ‌ర్భిణి కాన్పుకోసం ఆ ఆసుప‌త్రిలో చేరింది. కుటుంబ స‌భ్యులంతా ప్రైవేటు ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌మ‌న్నా.. వ‌ద్దు.. వ‌ద్దు.. ఆ దావాఖానాలో మంచి డాక్ట‌ర్‌లున్నారు. సాక్షాత్తు కలెక్ట‌ర్ శ్రీ‌మతి కూడా అక్క‌డే కాన్పు చేయించుకున్నార‌ని.. ఆ ధైర్యంతోనే ఆ మ‌హిళ కాన్పుకు వెళ్లింది. అయితే.. అక్క‌డి వైద్యుల నిర్ల‌క్ష్యం.. ఇత‌ర కార‌ణాల‌తో పురుట్లోనే ఆ బిడ్డ చ‌నిపోయింది. దాంతో వారంతా తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఆ త‌ల్లి దుఖఃనికి అంతేలేదు. ఆసుప‌త్రి వైద్యుల నిర్ల‌క్ష్యంతోనే త‌మ బిడ్డ చ‌నిపోయిందంటూ ఆసుప‌త్రి ఎదుట ఆందోళ‌న‌కు సైతం దిగారు. నిర్ల‌క్ష్యం వహించిన వారిని స‌స్పెండ్ చేయాల‌ని.. ఇటువంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా జిల్లా క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *