కావలి హరిజనవాడ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యా ఉపకరణాలు అందజేత
సాయికృష్ణ, రాజగోపాల్, భాస్కర్ రెడ్డి దాతృత్వం
పేద విద్యార్థులకు తోడ్పాటు అభినందనీయం
- కావలి హరిజనవాడ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యా ఉపకరణాలు అందజేత
- సాయికృష్ణ, రాజగోపాల్, భాస్కర్ రెడ్డి దాతృత్వం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువే పేద విద్యార్థులకు తోడ్పాటునిచ్చే దాతలు ముందుకు రావడం చాలా అభినందనేయమని కావలి మండల విద్యాశాఖ అధికారి గోవిందయ్య తెలిపారు. కావలి పట్టణంలోని తుమ్మలపెంట రోడ్డులో ఉన్న హరిజనవాడ పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దాతలు విద్యా ఉపకరణాలు అందజేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సాయికృష్ణ, రాజగోపాల్, భాస్కర్ రెడ్డి దాతృత్వంతో విద్యార్థులకు బుక్స్, ప్యాడ్స్ పెన్సు ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎంఈఓ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ సురేష్, ఉపాధ్యాయులు ఖాదర్ బాషా, విజయలక్ష్మి పాల్గొన్నారు.