ట్రాక్టర్ల వల్ల రోడ్లన్నీ డామేజ్ – ఎంపీడీవో నగేష్ కుమారి
విడవలూరులో సర్వసభ్య సమావేశంలో సమస్యలపై చర్చ
గ్రామ సర్పంచులు చర్యలు తీసుకోవాలి…
- ట్రాక్టర్ల వల్ల రోడ్లన్నీ డామేజ్
- ఎంపీడీవో నగేష్ కుమారి
- విడవలూరులో సర్వసభ్య సమావేశంలో సమస్యలపై చర్చ
నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన మూడు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని ఎంపీడీవో నగేష్ కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొని తమ సమస్యలను సలహాలను చర్చించుకోవడం జరిగింది. అనంతరం ఎంపీడీవో నగేష్ కుమారి మీడియాతో ఆర్ అండ్ బి ఏఈ రెండు సమస్యలను వెల్లడించారని తెలిపారు. రోడ్లపై కేజీల్ వీల్స్ వేసుకుని టాక్టర్లు నడపడం వలన రోడ్డులు డామేజ్ అయ్యి అద్వానంగా తయారవుతున్నాయని… వీటిపై గ్రామ సర్పంచులు తగు చర్యలు తీసుకోవాలని వారికి తెలియజేశారు. అదే విధంగా ఎలక్ట్రికల్ స్తంభాలు వేసేటప్పుడు విద్యుత్ సిబ్బంది పంచాయతీ సెక్రెటరీ కి, సర్పంచ్ కు సమాచారం ఇచ్చి వారి ఆధ్వర్యంలో జరపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.