పాఠశాల రూపురేఖలు మార్చడంలో ఎంతో కృషి
ఘనంగా రామతీర్ధం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ వీడ్కోలు సభ
శేషయ్య మాస్టార్ సేవలు ఎనలేనివి…
- పాఠశాల రూపురేఖలు మార్చడంలో ఎంతో కృషి
- ఘనంగా రామతీర్ధం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ వీడ్కోలు సభ
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు హెడ్మాస్టర్ మర్రిపాటి వెంకట శేషయ్య ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు, ముందుగా పాఠశాల విద్యార్థులు హెడ్మాస్టర్ కు పూలతో ఘన స్వాగతం పలికారు, అనంతరం హెడ్మాస్టర్ ని బాషా యూత్ పౌండేషన్ అధినేత వనమాల జనార్దన్ శాలువాతో ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా హెడ్మాస్టర్ గురించి ఆయన మాట్లాతూ హెడ్మాస్టర్ వెంకట శేషయ్య పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాల రూప రేఖలు మార్చడంలో ఎంతో కృషి చేశారని తెలిపారు, అదే విధంగా విద్యార్థులు క్రమశిక్షణ మరియు విద్యలో నైపుణ్యం పొందే విధంగా ఆయన విద్యార్థుల పట్ల వ్యవహరించడం గొప్ప విషయమని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.