సంక్షేమ పథకాల అమలుపై వైఎస్ఆర్సీపీ వినూత్న ప్రయత్నం
మేనిఫెస్టో రీ కాలింగ్ క్యూ ఆర్ కోడ్ ప్రారంభం
- సంక్షేమ పథకాల అమలుపై వైఎస్ఆర్సీపీ వినూత్న ప్రయత్నం
ప్రతీ జిల్లాలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి కూటమి మేనిఫెస్టో రీ కాలింగ్ క్యూ ఆర్ కోడ్ ను ప్రజల్లోకి తీసుకుపోతున్నామని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు పాలనపై మేనిఫెస్టో రీ కాలింగ్ క్యూఆర్ కోడ్ ను జిల్లా వైసీపీ కార్యాలయంలో…నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి మాట్లాడుతూ…తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టే కేసులకు ఎవరూ భయపడవద్దని…ఎన్ని కేసులు పెడితే అంతా నాయకులుగా మీరు ఎదిగారన్న విషయాన్ని గుర్తించాలని కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… సూపర్ స్టిక్స్ హామీలన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి రావలసిన సంక్షేమ పథకాలు ఎంత ఇచ్చారు అనేది తెలియరానుంందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.